వాటర్ బాటిల్ తో కోతిగారి ‘ఆట’ అదిరింది !

వాటర్ బాటిల్ తో కోతిగారి 'ఆట' అదిరింది !

'ది కోల్డెస్ట్ వాటర్' అనే సంస్థ తమ ఫ్లాస్కులు, వాటర్ బాటిల్స్ ప్రమోషన్ కోసం భలే ఐడియా వేసింది. ఓ వానరాన్నే ఇందుకు వినియోగించుకుంది. 'జార్జి' అనే ఈ కోతిగారి వాటర్ బాటిల్ ఓపెనింగ్ చూసి తీరాల్సిందే..

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Aug 08, 2020 | 4:22 PM

‘ది కోల్డెస్ట్ వాటర్’ అనే సంస్థ తమ ఫ్లాస్కులు, వాటర్ బాటిల్స్ ప్రమోషన్ కోసం భలే ఐడియా వేసింది. ఓ వానరాన్నే ఇందుకు వినియోగించుకుంది. ‘జార్జి’ అనే ఈ కోతిగారి వాటర్ బాటిల్ ఓపెనింగ్ చూసి తీరాల్సిందే.. ‘క్యూరియస్ జార్జ్ అన్ బాక్సింగ్ ఎ వాటర్ బాటిల్’ అనే టైటిల్ తో ఈ సంస్థ వీడియో రూపొందించి రిలీజ్ చేయగా అది వైరల్ అయింది. ఓ మిలియన్ మంది చూసి వావ్ అన్నారట.

ఈ బాక్సును ‘జార్జి’ అందుకోవడం, బాటిల్ మూత తెరవడం, అందులో ఏముందో చూడడం, మళ్ళీ భద్రంగా మూత బిగించడం అంతా వండర్ గా జరిగింది. ఇంతేకాదు.. ఈ సంస్థవారి మాన్యుల్ ని కూడా చదువుతున్నట్టు  జార్జి పోజు పెట్టడం వీడియోకి మరింత ప్రాధాన్యత నిచ్చింది. అమెరికన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ రిక్స్ చాంప్ మన్ ఈ వీడియోను షేర్ చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu