
కోరి కరోనావైరస్‌ను కొని తెచ్చుకునేవారిని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు.. మాంటెనోగ్రో దేశ ప్రజలు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ కరోనాను అక్కున తెచ్చుకుంటున్నారు.. అసలే అది చిన్న దేశం. ఇప్పటికే అక్కడ ఆరులక్షల మందికి కరోనా సోకింది.. అంటే మూడో వంతు ప్రజలు కరోనా బారిన పడ్డారు.. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి..? ఆ దేశంలో బిషప్ అమ్ఫిలోహిజే రాడోవిక్ కరోనా వైరస్ సోకి చనిపోయారు.. ఆయన భౌతికకాయాన్ని సందర్శించడానికి ప్రజలు చాలా మందే వచ్చారు. వచ్చిన వారు దూరం నుంచి చూసి వెళితే అయిపోయేది.. కానీ బిషప్ గౌరవార్థం ఆయన చేతిపై, నుదిటిపై మాస్కులు లేకుండా ముద్దులు పెట్టారు..
మరణించిన ఆయన శరీరంపై కరోనా వైరస్ ఉంటుందని తెలిసి, డాక్టర్ల హెచ్చరికలను పక్కనపెట్టి అలా ముద్దులు పెట్టేవారిని ఏమనాలి? ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలను పాటించలేదు.. మరణించిన బిషప్ రాడోవిక్ కూడా అంతే..! బిషపే కానీ రాజకీయాలు కూడా నెరుపుతుంటారు. ప్రస్తుతం దేశాధ్యక్షుడిగా ఉన్న మిలో జుకానోవిక్‌ను పదవి నుంచి దింపడానికి నానా ప్రయత్నాలు చేశారు.. మొన్న ఆగస్టులో జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ సోషలిస్ట్ నేత జుకానోవిక్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. పాశ్చాత్య సంస్కృతికి బద్ధ వ్యతిరేకి.. అయితే అయి ఉండవచ్చు కానీ.. ఈయన కూడా బతికున్నప్పుడు కరోనా నిబంధనలను అస్సలు పాటించలేదు.. మాస్క్‌లు పెట్టుకునేవారు కాదు.. భౌతిక దూరం పాటించేవారు కాదు.. అలా చేయడం వల్లే ఆయనకు కరోనా అంటుకుంది.. ఆ వ్యాధితోనే ఆయన చనిపోయారు.