నైరుతి రుతుపవనాల ప్రభావం మందగించింది. వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నప్పటకీ.. బంగాళాఖాతంలో అప్పపీడనం లేని కారణంగా వర్షాలు తగ్గుముఖంపట్టాయి. కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నా.. రాయలసీమలో పొడి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణ మాత్రం అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. కాగా.. నెల్లూరు తిరుపతిలో మంగళవారం 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి రుతుపవనాలు చురుకుగా మారేంతవరకూ వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.