తుఫాను ప్రభావం: ముంబైలో 48 గంటల పాటు హై అలర్ట్

ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలు మరో 24 నుంచి 48గంటల్లో తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మరో రెండు రోజులు ముంబైలో మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కాగా సోమవారం కురిసిన భారీ వర్షాలతో ముంబైలో ఇద్దరు మైనర్లు మరణించారని అధికారులు తెలిపారు. తమ ఇంటి సమీపంలో విద్యుత్ ఘాతానికి గురైన […]

తుఫాను ప్రభావం: ముంబైలో 48 గంటల పాటు హై అలర్ట్

Edited By:

Updated on: Jun 11, 2019 | 11:54 AM

ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలు మరో 24 నుంచి 48గంటల్లో తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మరో రెండు రోజులు ముంబైలో మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కాగా సోమవారం కురిసిన భారీ వర్షాలతో ముంబైలో ఇద్దరు మైనర్లు మరణించారని అధికారులు తెలిపారు. తమ ఇంటి సమీపంలో విద్యుత్ ఘాతానికి గురైన ఆ ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు ముంబై ప్రకృతి విపత్తుల శాఖ అధికారులు తెలిపారు.