ఏపీకి ముందే రానున్న రుతుపవనాలు

| Edited By:

Jun 07, 2019 | 5:25 PM

అనుకున్న సమయానికంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు రానున్నాయని ఆర్టీజీఎస్(రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) అంచనా వేసింది. దీంతో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 11, 12 తేదీల్లో రాయలసీమను తాకనున్న రుతుపవనాలు.. ఆపై రెండు రోజుల్లోపే దక్షిణ కోస్తాపై విస్తరిస్తాయని ఆర్టీజీఎస్ తెలిపింది. ఆలోపే తెలంగాణకు నైరుతి వ్యాపిస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. అల్పపీడన ద్రోణి, క్యుములో నింబస్ మేఘాల కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన […]

ఏపీకి ముందే రానున్న రుతుపవనాలు
Follow us on

అనుకున్న సమయానికంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు రానున్నాయని ఆర్టీజీఎస్(రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) అంచనా వేసింది. దీంతో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 11, 12 తేదీల్లో రాయలసీమను తాకనున్న రుతుపవనాలు.. ఆపై రెండు రోజుల్లోపే దక్షిణ కోస్తాపై విస్తరిస్తాయని ఆర్టీజీఎస్ తెలిపింది. ఆలోపే తెలంగాణకు నైరుతి వ్యాపిస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. అల్పపీడన ద్రోణి, క్యుములో నింబస్ మేఘాల కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్ అధికారి ఒకరు తెలిపారు.