వర్షాలకు మరిన్ని రోజులు ఎదురుచూడాల్సిందే

తెలంగాణలోని నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 20న గానీ.. ఆ తరువాత గానీ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. వాయు తుఫాను వలన ఈ రుతుపవనాల రాక ఆలస్యం అవుతోందని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 18వరకు ఎండల తీవ్రత కొనసాగనుందని వారు తెలిపారు. కొన్ని చోట్ల 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. వడగాలులు వీచే […]

వర్షాలకు మరిన్ని రోజులు ఎదురుచూడాల్సిందే

Edited By:

Updated on: Jun 17, 2019 | 10:57 AM

తెలంగాణలోని నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 20న గానీ.. ఆ తరువాత గానీ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. వాయు తుఫాను వలన ఈ రుతుపవనాల రాక ఆలస్యం అవుతోందని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 18వరకు ఎండల తీవ్రత కొనసాగనుందని వారు తెలిపారు. కొన్ని చోట్ల 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. వడగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు. అయితే మొదట ఈ నెల 12న రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నప్పటికీ.. వాయు తుఫాను వలన ఆలస్యమవుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎండల తీవ్రతతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అల్లాడుతోన్న విషయం తెలిసిందే.