Monal Gajjar : ‘అల్లుడు అదుర్స్‌’లో మోనాల్ గజ్జర్ స్పెషల్ సాంగ్..రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

|

Dec 31, 2020 | 7:26 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో గెలిచిన అభిజిత్..రన్నరప్‌గా నిలిచిన అఖిల్..సెకండ్ రన్నరప్‌గా నిలిచిన సోహైల్..వీరందర్నీ పక్కనబెడితే సీజన్ మొత్తం మోస్ట్ హాట్ టాపిక్‌గా నిలచిన పేరు మోనాల్ గజ్జర్.

Monal Gajjar : అల్లుడు అదుర్స్‌లో మోనాల్ గజ్జర్ స్పెషల్ సాంగ్..రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
Follow us on

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో గెలిచిన అభిజిత్..రన్నరప్‌గా నిలిచిన అఖిల్..సెకండ్ రన్నరప్‌గా నిలిచిన సోహైల్..వీరందర్నీ పక్కనబెడితే సీజన్ మొత్తం మోస్ట్ హాట్ టాపిక్‌గా నిలచిన పేరు మోనాల్ గజ్జర్. అవును బిగ్ బాస్ ఇంట్లో మస్త్ మజా వచ్చింది ఈ బ్యూటీ వల్లనే. మోనాల్ ప్రేమను దక్కించుకునేందుకు అభిజీత్, అఖిల్ తొలుత తెగ పోటీ పడ్డారు. ఆ తర్వాత అభి డ్రాప్ అవ్వడంతో..అఖిల్ సోలోగా లవ్ ట్రాక్ నడిపించాడు. దీంతో షో బజ్ ఓ రేంజ్‌లో పెరిగింది. బిగ్ బాస్ షో ముగిసిన అనంతరం మోనాల్‌కు ఓ రేంజ్‌లో ఆఫర్లు వస్తున్నాయి. ఆమెకు ఇప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్ ఛాన్సులు వచ్చినట్లు ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ బ్యూటీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా న‌టిస్తోన్న అల్లుడు అదుర్స్ చిత్రంలో ఐటెం సాంగ్‌లో నర్తించనుంది. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ తెరకెక్కిస్తున్నారు.   ఈ పాట‌లో సాయి శ్రీనివాస్‌, సోనూసూద్ తో క‌లిసి స్టెప్పులేస్తోంది బిగ్ బాస్ బ్యూటీ. అయితే ఈ పాట కోసం మోనాల్ గజ్జర్ రెమ్యూనరేషన్ విషయం ఫిల్మ్ సర్కిల్‌లో చర్చనీయాంశమైంది. ప్రొడ్యూసర్లకు ఇబ్బంది లేకుండా కేవలం రూ. 15 లక్షలు మాత్రం ఛార్జ్ చేసిందట.  మీడియం రేంజ్ ఉన్న హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్ అంటే ఓ రేంజ్ పారితోషకం అడుగుతున్న ఈ రోజుల్లో మోనాల్ రీజనబుల్ రెమ్యూనరేషన్ తీసుకోవడంతో హ్యాపీగా ఉన్నారట మేకర్స్.

Also Read :

Drink and Drive : తాగి వాహనం నడిపితే కాలేజీలకు లేఖలు…విద్యార్థులకు సీపీ సజ్జనార్ వార్నింగ్…

Corona vaccine dry run : వ్యాక్సిన్ రిహార్సల్స్.. జనవరి 2న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో డ్రైరన్..

Ap food processing policy : ఏపీలో నూతన ఆహారశుద్ధి విధానం అమల్లోకి.. రైతు భరోసా కేంద్రాలే ప్రాసెసింగ్ కేంద్రాలు !