Molar Pregnancy : విచిత్రమైన ముత్యాల గర్భం…ప్రెగ్నంట్ అవుతారు..కానీ కడుపులో బిడ్డ ఉండదు

|

Dec 29, 2020 | 4:19 PM

ముత్యాల గర్భం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..?..లేదంటే మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. మాములుగా ప్రెగ్నన్సీ  అయిన మూడో నెల నుంచి మహిళలకు కడుపు పెరుగుతుంది.

Molar Pregnancy : విచిత్రమైన ముత్యాల గర్భం...ప్రెగ్నంట్ అవుతారు..కానీ కడుపులో బిడ్డ ఉండదు
Follow us on

Molar Pregnancy :  ముత్యాల గర్భం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..?..లేదంటే మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. మాములుగా ప్రెగ్నన్సీ  అయిన మూడో నెల నుంచి మహిళలకు కడుపు పెరుగుతుంది. అయితే పెరుగుదల ఎక్కువగా ఉంటే..కవలలు అనుకుని భ్రమ పడకండి. మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. అవును అది ముత్యాల గర్బం అయ్యే ప్రమాదం ఉంది. స్కాన్‌లో గర్బం ఉంటుంది కానీ బిడ్డ ఉండని విచిత్ర పరిస్థితినే ముత్యాల గర్భం అంటారు. కడుపు పెరుగుతుంది. వాంతులు అవుతాయి. ప్రెగ్నన్సీ హార్మోన్స్ కూడా అధిక సంఖ్యలో ఉంటాయి. కానీ కడుపులో బుజ్జాయి ఉండదు. వినడానికి విచిత్రంగా ఉంది కదా కానీ ఇది నిజం.

ఒక  పిండం ఏర్పడడానికి ఒక ఆరోగ్యకరమైన స్పెర్మ్ , ఒక ఆరోగ్యకరమైన అండంతో సంయోగం చెందాలి. అలా తండ్రి నుంచి రెండు, తల్లి నుంచి రెండు క్రోమోజోములు బిడ్డకు సంక్రమిస్తాయి. అయితే ముత్యాల గర్భంలో ఆరోగ్యవంతమైన ఒక శుక్రకణం, క్రోమోజోములు లేని ఒక ఖాళీ అండంతో సంయోగం చెంది… తన క్రోమోజోముల్ని రెట్టింపు చేసుకుంటుంది. దీనిలో మరోరకం కూడా ఉంటుంది. రెండు శుక్రకణాలు… ఒక ఖాళీ అండంతో  కలవడం వల్ల ఏర్పడిన పిండంలో కేవలం మగ క్రోమోజోములు మాత్రమే వుంటాయి. అండం తాలూకు క్రోమోజోములుండవు. దీన్ని సంపూర్ణమైన ముత్యాల గర్భం అంటారు. ముత్యాల గర్భం ఏర్పడితే కడుపులో పిండం బిడ్డలా ఎదగదు.. ముత్యాల వంటి బుడగల ఆకారంలో ఎదుగుతుంది. Beta- HCG అనే హార్మోన్ సాధారణ గర్భంలో కనిపించే స్థాయి కన్నా మరింత ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా డాక్టర్లు అది ముత్యాల గర్భం అని అంచనాకు వస్తారు. పూర్తి  నిర్ధారణ తెలియాలంటే ఆ ముత్యాల వంటి కణాలను బయాప్సీ పరీక్ష చేయాల్సి ఉంటుంది.

Also Read : ‘Master’ release date : ‘సంక్రాంతి బరిలోకి నేనూ వస్తున్నా’..రేస్‌లోకి దూసుకువచ్చిన ఇళయదళపతి విజయ్