మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో’ఆచార్య’ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ‘ఆచార్య’ సెట్ లో ఓ అతిధి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ కు షాక్ ఇచ్చారు. ఆయన ఎవరో కాదు డైలాగ్ కింగ్ మోహన్ బాబు. టాలీవుడ్ లో చిరంజీవి, మోహన్ బాబు మంచి మిత్రులన్న విషయం తెలిసిందే. గతంలో ఇద్దరిమధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్న అవన్నీ తొలిగిపోయి ఎంతో స్నేహభావంతో మెలుగుతున్నారు. ఇక బుధవారం మోహన్‌బాబు ‘ఆచార్య’ సెట్స్ దగ్గరకు వెళ్లి, చిరంజీవికి బొకే ఇచ్చి, స్నేహపూర్వకంగా కలిశారు. చిరకాల మిత్రుడు తన సినిమా సెట్స్‌కు రావడంతో చిరంజీవి ఆనందంతో మోహన్‌బాబును ఆహ్వానించారు. ఆతర్వాత ఇద్దరూ కొద్దిసేపు సినిమాలతో పాటు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. ఇక మోహన్ బాబు ప్రస్తుతం ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాలో నటిస్తున్నారు.