ఇవాళ జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి పురస్కరించుకుని యావత్ భారతావని ఘనంగా నివాళ్లులర్పించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు ఢిల్లీ రాజ్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. యువత మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మాగాంధీ అని కొనియాడారు.
#RamNathKovind, PM Modi pays tribute to #MahatmaGandhi at Rajghat- TV9#GandhiJayanti #TV9Telugu pic.twitter.com/FHGZcLQCqw
— TV9 Telugu (@TV9Telugu) October 2, 2020
మరోవైపు ఈరోజు మాజీ ప్రధాని లాల్‌బహుదూర్ శాస్త్రి జయంతి సైతం కావడంతో విజయ్‌ఘాట్ వద్ద ఆయనకు ప్రధాని నరేంద్రమోడితోపాటు లాల్‌బహుదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి సైతం అంజలి ఘటించారు. పలువురు రాజకీయ ప్రముఖులు, నాయకులు సైతం మహాత్మా గాంధీకి, లాల్‌బహుదూర్ శాస్త్రికి నివాళులర్పించారు.