కేంద్ర కేబినెట్‌ తొలి భేటీ..రైతుల కోసం కీలక నిర్ణయం

|

May 31, 2019 | 8:18 PM

న్యూఢిల్లీ: నూతన ప్రభుత్వం కొలువుదీరిన మరుసటి రోజే కేంద్ర మంత్రిమండలి భేటీ అయ్యి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమైన పథకంపై ప్రధాని నరేం‍ద్ర మోదీ తొలి సంతకం చేశారు. కొత్త ప్రభుత్వంలో తొలి మంత్రిమండలి సమావేశం కావడంతో భేటీపై మొదటి నుంచి ఉత్కంఠ నెలకొంది. దానికి అనుగుణంగానే కొన్ని కీలక నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకుంది. దేశ రక్షణ నిధి నుంచి అమరులైన సైనికుల పిల్లలకు ఇచ్చే ఉపకారవేతనాలను పెంచుతూ.. నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు రెండువేల నుంచి 2500కు, విద్యార్థినులకు 2250 నుంచి 3వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర పారామిలటరీ బలగాలతో పాటు, రాష్ట్రంలో […]

కేంద్ర కేబినెట్‌ తొలి భేటీ..రైతుల కోసం కీలక నిర్ణయం
Follow us on

న్యూఢిల్లీ: నూతన ప్రభుత్వం కొలువుదీరిన మరుసటి రోజే కేంద్ర మంత్రిమండలి భేటీ అయ్యి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమైన పథకంపై ప్రధాని నరేం‍ద్ర మోదీ తొలి సంతకం చేశారు. కొత్త ప్రభుత్వంలో తొలి మంత్రిమండలి సమావేశం కావడంతో భేటీపై మొదటి నుంచి ఉత్కంఠ నెలకొంది. దానికి అనుగుణంగానే కొన్ని కీలక నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకుంది. దేశ రక్షణ నిధి నుంచి అమరులైన సైనికుల పిల్లలకు ఇచ్చే ఉపకారవేతనాలను పెంచుతూ.. నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు రెండువేల నుంచి 2500కు, విద్యార్థినులకు 2250 నుంచి 3వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర పారామిలటరీ బలగాలతో పాటు, రాష్ట్రంలో అమలు అయ్యే పోలీసు కుటుంబాలకు కూడా ఈపథకాన్ని వర్తించే విధంగా రూపకల్పన చేశారు. ఏడాదికి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన వారి నుంచి ఇకపై ఎంపిక చేయనున్నారు.

ప్రధాని కార్యాలయంలో మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో హోంమంత్రి అమిత్‌షా సహా 24మంది కేబినెట్‌ మంత్రులు, 9మంది స్వతంత్ర హోదా కల్గిన మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. నూతన ప్రభుత్వంలో జూన్‌ 17 నుంచి జూలై 26 వరకు పార్లమెంట్‌ తొలి సమావేశాలు నిర్వహించాలని కేంద్రమంత్రి మండలి నిర్ణయించింది. జూన్‌ 19న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక చేపట్టనున్నారు. మొదటి సమావేశంలోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భేటీలో నిర్ణయించారు.

కాగా కొత్త కేబినెట్‌.. కీలక నిర్ణయం తీసుకుంది. రైతులందరికీ ప్రధాన మంత్రి కిసాన్‌ పెన్షన్‌ యోజన పథకం అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ నిర్ణయంతో ఇకపై అదనంగా రెండు కోట్ల మంది రైతులు ఈ పథకం కింద పెన్షన్‌ పొందే వీలు కలగనుంది. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.75వేల కోట్లు ఖర్చవుతుండగా ఇకపై 13వేల కోట్లు అదనంగా ఖర్చు కానుంది.