అలీఘ‌ర్ ముస్లిం యూనివ‌ర్సిటీ దేశానికే ఆద‌ర్శం.. శ‌తాబ్ది ఉత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ

|

Dec 22, 2020 | 12:30 PM

అలీఘ‌ర్ ముస్లిం యూనివ‌ర్సిటీ దేశానికి ఆద‌ర్శ‌మ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. ఏఎంయూ స్థాపింపి వందేళ్లైన సంద‌ర్భంగా శ‌తాబ్ది మ‌హోత్స‌వానికి ప్ర‌ధాని మోదీ ముఖ్యతిథిగా...

అలీఘ‌ర్ ముస్లిం యూనివ‌ర్సిటీ దేశానికే ఆద‌ర్శం.. శ‌తాబ్ది ఉత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ
Follow us on

అలీఘ‌ర్ ముస్లిం యూనివ‌ర్సిటీ దేశానికి ఆద‌ర్శ‌మ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. ఏఎంయూ స్థాపింపి వందేళ్లైన సంద‌ర్భంగా శ‌తాబ్ది మ‌హోత్స‌వానికి ప్ర‌ధాని మోదీ ముఖ్యతిథిగా వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్నారు. వాస్త‌వానికి యూనివ‌ర్సిటీ స్థాపించి సెప్టెంబ‌ర్ 14వ తేదీతో వందేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా లాక్ డౌన్ కార‌ణంగా శ‌తాబ్ది ఉత్స‌వాలు జ‌ర‌ప‌లేక‌పోయారు. నూరేళ్ల సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఏఎంయూపై పోస్ట‌ల్ స్టాంప్‌ను ప్ర‌ధాని మోదీ ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ.. అలీఘ‌ర్ ముస్లిం యూనివ‌ర్సిటీ మినీ ఇండియా అని అన్నారు. దేశంలో ఎవ‌రిపై వివ‌క్ష లేకుండా ప్ర‌తి ఒక్క‌రికి అభివృద్ది ఫ‌లాలు అందుతున్నాయి. ఆ ప్ర‌తిపాదిక‌నే దేశం ముందుకు వెళ్తోంద‌ని అన్నారు. ప్ర‌తి వ్య‌క్తికి రాజ్యాంగ‌ప‌ర‌మైన హ‌క్కులు అందుతున్నాయ‌ని, భ‌విష్య‌త్‌పై భ‌రోసాతో స‌మాన గౌర‌వం పొందుతూ త‌మ క‌ల‌ల‌ను నిజం చేసుకుంటున్నాయ‌ని అన్నారు. స‌బ్ కా సాత్‌, స‌బ్‌కా వికాస్ విశ్వాస్ అనే మంత్రం దీని వెనుక ఉంద‌న్నారు.

ఏ మ‌తంలో పుట్టినా జాతీయ ల‌క్ష్యాల‌ను త‌గిన‌ట్లుగా ప్ర‌జాజీవ‌నం ఉండాల‌ని మోదీ అన్నారు. అలీఘ‌ర్ ముస్లిం యూనివ‌ర్సిటీ అనేక మంది స్వాతం‌త్య్ర స‌మ‌ర‌యోధుల‌ను ఇచ్చింద‌న్నారు. స్వాతంత్య్రోద్య‌మం ఎలాగైతే మ‌న‌ల్ని ఐక్యం చేసిందో అదే విధంగా న‌యా భార‌త్ కోసం పని చేయాల‌ని మోదీ అన్నారు. అలీఘ‌ర్ ముస్లిం యూనివ‌ర్సిటీని 1920 డిసెంబ‌ర్ ఒక‌టో త‌దేఈన ఏర్పాటు చేశారు.