పద్య ప్రభంజనం పేరుతో రూపొందించిన పద్యకవుల కవితా సంకలనాన్ని ఎమ్మెల్సీ కవిత ఇవాళ హైదరాబాద్ లో ఆవిష్కరించారు. మెతుకు సీమ రచయితల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న కవిత, కవుల ప్రయత్నాన్ని అభినందించారు. ఈ సంకలనంలో ఆరువందలకు పైగా రచయితలు పాల్గొన్నారు. పుస్తకం చదివిన తర్వాత ఇది ఓ జాతీయ కావ్యంలా అనిపించిందన్నారు కవిత. తెలుగు భాషలో పద్యానికి ఉన్న గొప్పతనాన్ని తెలియజేశారు. ఇలాంటి సాహిత్య ప్రక్రియ ద్వారా జాతిని ఎలా జాగృతం చేయాలనే అంశంపై దృష్టి పెట్టాలని కూడా ఆమె సూచించారు.
మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ వారి ఆధ్వర్యంలో 610కవుల భాగస్వామ్యంతో ‘పద్య ప్రభంజనం-దేశభక్తి పద్య బృహత్సంకలనం ఆవిష్కరణోత్సవం’లో పాల్గొనడం జరిగింది. pic.twitter.com/a1HAsJcpWm
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 24, 2021