
గోదావరి నదిపై నూతనంగా నిర్మించిన బోర్నపల్లి వంతెనను ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్-ఉమ్మడి కరీంనగర్ జిల్లాలను కలుపుతూ రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించిన నూతన వంతెనను ఎమ్మెల్సీ కవిత గురువారం పరిశీలించారు.
వంతెన పరిశీలన సందర్భంగా కవిత మాట్లాడుతూ.. దశాబ్దాల నాటి కలల ప్రాజెక్టు పూర్తి అయిందన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల మధ్య రాకపోకల సమస్య తీరనున్నట్లు తెలిపారు. ఈ కలని సాకరం చేయడంలో ఎంతో మద్దతునిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంచి విషయాలు సహజంగా సమయం తీసుకుంటాయంటారు. ప్రజల సౌకర్యం కోసం అతి త్వరలోనే వంతెన అందుబాటులోకి వస్తుందని కవిత పేర్కొన్నారు. ఈ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
They say good things take time and I couldn’t have agreed more! As a MP, I made a promise in 2014 to construct a bridge across Godavari river in Bornapalli. Visited to see the complete structure which will soon open for people. I would like to thank Hon’ble CM Sri KCR 1/2 pic.twitter.com/uSFRj7R6Xg
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 17, 2020
ఇదిలావుంటే ఈ బోర్నపల్లి వంతెనను ఈ నెల 21న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.