AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు మోదీ సర్కార్ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా.? వైరల్ అవుతున్న మెసేజ్.. వివరణ ఇచ్చిన కేంద్రం..

నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోంది. ఉచిత ల్యాప్‌టాప్‌లు పొందేందుకు స్టూడెంట్స్..

విద్యార్థులకు మోదీ సర్కార్ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా.? వైరల్ అవుతున్న మెసేజ్.. వివరణ ఇచ్చిన కేంద్రం..
Ravi Kiran
|

Updated on: Dec 17, 2020 | 6:56 PM

Share

Modi Govt Distributing Free Laptops: కరోనా వైరస్ అన్నింటినీ మార్చేసింది. ముఖ్యంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపించింది. దేశవ్యాప్తంగా మార్చి నెల నుంచి స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ తరుణంలోనే విద్యార్థుల భవిష్యత్తు ప్రశార్ధకరంగా మారకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు బోధిస్తున్నాయి. స్టూడెంట్స్ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా టీచర్లతో ఇంట్రాక్ట్ అయి.. డౌట్స్‌ను నివృత్తి చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఓ మెసేజ్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

‘నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోంది. ఉచిత ల్యాప్‌టాప్‌లు పొందేందుకు స్టూడెంట్స్ ‘http://bit.ly/Register-For-Free-Laptop’ లింక్ ద్వారా నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాలి ” అని ఆ మెసేజ్ సారాంశం. ఈ మెసేజ్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనితో కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది.

స్టూడెంట్స్‌కు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నామంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త అవాస్తవమని.. ఎవరో మార్ఫింగ్  చేసి ఆ మెసేజ్‌ను క్రియేట్ చేశారని.. కేంద్రం అలాంటి పధకాన్ని ఏమి అమలు చేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పష్టత ఇచ్చింది.