ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్.. మరి కాసేపట్లో గాంధీనగర్ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల పాదయాత్ర.

|

Nov 29, 2020 | 8:13 AM

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం చివరిస్థాయికి చేరుకోవడంతో అన్ని పార్టీల సభ్యులు డివిజన్లలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా తమ హామీలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తోంది.

ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్.. మరి కాసేపట్లో గాంధీనగర్ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల పాదయాత్ర.
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉదయం తొమ్మిది గంటల నుంచి గాంధీనగర్ డివిజన్‌లో ప్రచారం ప్రారంభిస్తారు. అక్కడ టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికి మద్దతుగా పాదయాత్ర చేస్తారు. అయితే నిన్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడారు.

ఇప్పుడున్న హైదరాబాద్, గత ఆరేండ్ల కిందటి హైదరాబాద్‌ను ఒకసారి ఓటర్లు భేరీజు వేసుకోవాలనుకున్నారు. జాతీయ పార్టీలు చాలా ఏళ్లు అధికారంలో ఉన్నా హైదరాబాద్‌ను ఏనాడు పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నగరం రూపురేఖలు మార్చేసిందన్నారు. అద్దంలా మెరిసే రోడ్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, ఈ కామర్స్ మొదలైనవన్ని టీఆర్ఎస్ వల్లే సాధ్యమయ్యాయని ప్రజలు గుర్తించాలన్నారు. హైదరాబాద్‌కు వరదలు వస్తే ఏ ఒక్క పార్టీ కానీ, నాయకుడు కానీ పట్టించుకోలేదు కానీ మన టీర్ఎస్ ప్రభుత్వం నష్టపోయిన కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంత పెద్దమొత్తంలో సాయం అందించలేదని ప్రకటించింది. ఢిల్లీలో ఉన్నవారు మన హైదరాబాద్‌కు ఏం చేయరని, మన హైదరాబాద్‌ను మనమే కాపాడాలని హితవు చెప్పారు. అందుకే నగరవాసులంందరు టీఆర్ఎస్‌కు మద్దతు తెలిపి తమ అమూల్యమైన ఓటుతో అభ్యర్థులందరిని గెలిపించాలని కోరారు.