జార్జిరెడ్డి దుమారంలోకి “రాజాసింగ్” ఎంటర్.. ఏం వార్నింగ్ ఇచ్చారంటే.?

విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న సినిమా ‘జార్జిరెడ్డి’. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలే రిలీజ్ అయ్యింది. అయితే ఈ ప్రోమోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ దుమారంలోకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఎంటర్‌ అయ్యారు. ఈ సినిమాను వాస్తవాలకు వ్యతిరేకంగా తీశారని.. దీంట్లో మొత్తం “వన్‌సైడ్‌”గా చూపెట్టారంటూ ఆరోపించారు. వాస్తవం ఏంటో చూపించాలన్నారు. సినిమా ముసుగులో మా సంఘాలపై ఆరోపణలు చేయరాదన్నారు. ఏబీవీపీని కించపరిస్తే సహించేది లేదని.. అలా […]

జార్జిరెడ్డి దుమారంలోకి రాజాసింగ్ ఎంటర్.. ఏం వార్నింగ్ ఇచ్చారంటే.?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 19, 2019 | 9:58 PM

విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న సినిమా ‘జార్జిరెడ్డి’. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలే రిలీజ్ అయ్యింది. అయితే ఈ ప్రోమోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ దుమారంలోకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఎంటర్‌ అయ్యారు. ఈ సినిమాను వాస్తవాలకు వ్యతిరేకంగా తీశారని.. దీంట్లో మొత్తం “వన్‌సైడ్‌”గా చూపెట్టారంటూ ఆరోపించారు. వాస్తవం ఏంటో చూపించాలన్నారు.

సినిమా ముసుగులో మా సంఘాలపై ఆరోపణలు చేయరాదన్నారు. ఏబీవీపీని కించపరిస్తే సహించేది లేదని.. అలా చేస్తే సినిమాను ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామన్నారు. జార్జిరెడ్డి హత్య జరిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుందని, అయితే చిత్రంలో ఏబీవీపీకి చెందిన వ్యక్తులు ఈ హత్య చేశారన్నట్టుగా వక్రీకరించారంటూ ఆరోపించారు. నిజాల్ని చూపిస్తే.. సమస్య లేదని.. కానీ వక్రీకరిస్తూ.. ఏబీవీపీపై ఆరోపణలు చేస్తే మాత్రం.. మా నుంచి తప్పకుండా రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. చిత్రంలో కొన్ని సీన్స్‌ను కట్ చేయాలంటూ డిమాండ్ చేశారు రాజాసింగ్. అసలు, ఇలాంటి మూవీస్‌కు సెన్సార్ బోర్డు ఎలా అనుమతిస్తోందో అర్ధం కావట్లేదన్నారు.