కడప జిల్లా పొద్దుటూరు టీడీపీ నేత దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. సోమలవారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ స్థలం వద్ద దుండగులు మరణాయుధాలతో సుబ్బయ్యను అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ హత్య ఘటనపై సుబ్బయ్య తల్లి లక్షీదేవి, భార్య అపరాజితలు ఆరోపణలు చేశారు. పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డే హత్య చేయించారని ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. వారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
హత్యకు గురైన నందం సుబ్బయ్య 14 కేసుల్లో ముద్దాయి.. నేర చరిత్ర కలిగిన వ్యక్తి. సుబ్బయ్యకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు. సుబ్బయ్యను చంపాల్సిన అవసరం నాకేంటి అని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ఐదుగురు హంతకులను పోలీసులు అరెస్టు చేశారు. హింసను ప్రేరేపించే మనస్తత్వం నాది కాదని అన్నారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగి ఉండొచ్చని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
Also Read: