‘కారు మాదే, యాక్సిడెంట్ చేసింది నా కుమారుడు కాదు’ : సైబర్‌ టవర్స్‌ వద్ద ప్రమాదంపై ఎమ్మెల్యే కాటసాని వివరణ

రీసెంట్‌గా సైబర్‌ టవర్స్‌ దగ్గర జరిగిన కారు ప్రమాద ఘటనలో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి పేరు తెరపైకి రావడం సంచలనం సృష్టిస్తోంది.

'కారు మాదే, యాక్సిడెంట్ చేసింది నా కుమారుడు కాదు' : సైబర్‌ టవర్స్‌ వద్ద ప్రమాదంపై ఎమ్మెల్యే కాటసాని వివరణ
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 15, 2020 | 9:20 AM

రీసెంట్‌గా సైబర్‌ టవర్స్‌ దగ్గర జరిగిన కారు ప్రమాద ఘటనలో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి పేరు తెరపైకి రావడం సంచలనం సృష్టిస్తోంది. సిగ్నల్‌ను దాటి బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలను ఓ బెంజ్‌ కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో భర్త గౌతమ్‌ చనిపోగా, అతని భార్య ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఈ ప్రమాదానికి కారణమైన కారు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిది కావడంతో కలకలం మొదలైంది. ఈ కారులో కాటసాని కుమారుడు ఓబుల్‌రెడ్డి కూడా ఉన్నారన్న వార్తలతో దుమారం చెలరేగింది.

ఈ వార్తలపై ఎమ్మెల్యే కాటసాని స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. నాలుగు రోజుల క్రితం తమ బెంజ్‌ కారును రిపేర్‌ కోసం గ్యారేజ్‌లో ఇచ్చినట్లు తెలిపారు. ఆ కారును తన కొడుకు స్నేహితుడు కౌశిక్‌ గ్యారేజ్‌ నుంచి తీసుకెళ్లాడన్నారు. ఇంటికి తేకుండా.. స్నేహితుడు కాశీ విశ్వనాథ్‌తో కలిసి పబ్‌కు వెళ్లాడని.. కౌశిక్‌ తిరిగొస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు ఎమ్మెల్యే. పబ్‌లో కానీ.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కానీ.. ఓబుల్‌రెడ్డి ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకోవచ్చన్నారు. అసలు ప్రమాద సమయంలో ఓబుల్‌రెడ్డి బనగానపల్లెలో పాదయాత్రలో పాల్గొన్నారని.. ప్రమాదంతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కాటసాని. కాగా కాశీ విశ్వనాథ్‌పై గ‌తంలో అబిడ్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా న‌మోదు అయ్యింది. గ‌తంలోనే విశ్వనాథ్ డ్రైవింగ్ లైసెన్స్‌ను పోలీసులు ర‌ద్దు చెయ్యాల‌ని రవాణ శాఖ‌కు లేఖ పంపించారు.

Also Read :

పాక్ దౌత్యాధికారికి భారత్ సమన్లు, సరిహద్దులో కాల్పుల విరమణకు తూట్లు పొడవడంపై ఆగ్రహం

ట్రంప్ మద్దతు దారుల నిరసన, తిరగబడ్డ వ్యతిరేక వర్గాలు, పెప్పర్ స్ప్రేను ఉపయోగించిన పోలీసులు

కొమురంభీం జిల్లాలో కానిస్టేబుల్ మిస్సింగ్, భార్య ఫిర్యాదు, ఇక్కడే అసలు ట్విస్ట్ !