ట్రంప్ మద్దతు దారుల నిరసన, తిరగబడ్డ వ్యతిరేక వర్గాలు, పెప్పర్ స్ప్రేను ఉపయోగించిన పోలీసులు

వామపక్ష కార్యకర్తలు వాషింగ్టన్, డి.సి.లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులను వెంబడించారు. వారికి ఆతిథ్యమిస్తున్న ఒక డౌన్‌టౌన్ హోటల్‌ను ముట్టడించారు.

ట్రంప్ మద్దతు దారుల నిరసన, తిరగబడ్డ వ్యతిరేక వర్గాలు, పెప్పర్ స్ప్రేను ఉపయోగించిన పోలీసులు
Follow us

|

Updated on: Nov 15, 2020 | 8:37 AM

వామపక్ష కార్యకర్తలు వాషింగ్టన్, డి.సి.లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులను వెంబడించారు. వారికి ఆతిథ్యమిస్తున్న ఒక డౌన్‌టౌన్ హోటల్‌ను ముట్టడించారు. ఈ క్రమంలో అలెర్టయిన పోలీసులు వారిని నిలవరించేందుకు అష్టకష్టాలు పడ్డారు. చివరకు  పెప్పర్ స్ప్రేను కూడా ఉపయోగించి బలవంతంగా జనాన్ని అక్కడ్నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. రిపబ్లికన్లకు ప్రెసిడెంట్ పదవి మరో నాలుగేళ్లు కావాలని, భారీ మోసపూరిత పథకాలతో ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించారని వేలాది మంది కార్యకర్తలు శనివారం దేశ రాజధానిలో ర్యాలీ చేశారు.

ర్యాలీ చాలావరకు శాంతియుతంగా జరిగింది. కాని బ్లాక్ లైవ్స్ మేటర్, యాంటిఫా కార్యకర్తలు వైట్ హౌస్‌కు దగ్గర్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. ఈ క్రమంలో ట్రంప్ మద్దతుదారులు తిరిగి  హోటళ్లకు చేరుకుంటోన్న సమయంలో హింసాత్మక వాతావరణం ఏర్పడింది. ట్రంప్ బొమ్మ ఉన్న టీ షర్ట్ ధరించిన ఒక వ్యక్తిపై దాడులు చేశారు. ఒక స్పుత్నిక్ రిపోర్టర్ ఒక ట్రంపిస్ట్ నుంచి  జెండాను లాక్కునే ప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులతో నిరసనల్లో పాల్గొంటోన్న వారిని కూడా వెంబండించారు. దీంతో పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించిన పోలీసులు పరిస్థితులను అదుపు చేయడానికి, ట్రంప్ మద్దతుదారులను రక్షించడానికి ప్రయత్నించారు. హింసాత్మక దాడులకు పాల్పడినవారిని అదుపులోకి తీసుకున్నారు. 

ట్రంపిస్టుల బృందానికి ఆతిథ్యమిస్తున్న డౌన్‌టౌన్ హోటల్‌ను హింసాత్మక జనం ముట్టడించిన తరువాత లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అక్కడే ఉన్న  ట్రంప్ ప్రధాన మద్దతుదారుడు ది కాపిటల్ హిల్టన్‌ను వేరే ప్రాంతానికి తరలించారు. బయట ఆపి ఉంచిన కార్లను ధ్వంసం చేయడానికి నిరసనకారులు యత్నించడంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు పెప్పర్ స్ప్రేలను ఉపయోగించారు.

Also Read : 

పాక్ దౌత్యాధికారికి భారత్ సమన్లు, సరిహద్దులో కాల్పుల విరమణకు తూట్లు పొడవడంపై ఆగ్రహం