Lifestyle: ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?

నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిపుణులు సైతం నెయ్యిని కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే నెయ్యిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు...

Lifestyle: ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?
Ghee Health
Follow us

|

Updated on: May 02, 2024 | 3:37 PM

నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిపుణులు సైతం నెయ్యిని కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే నెయ్యిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఉదయం పరగడపున నెయ్యిని తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* సాధారణంగా నెయ్యి తింటే బరువు పెరుగుతామని అనుకుంటాం. కానీ పడగడుపున నెయ్యి తీసుకుంటే మాత్రం శరీరంలోని కొవ్వును తగ్గించడంలో నెయ్యి సహాయపడుతుంది. నిజానికి, బ్యూట్రిక్ యాసిడ్ నెయ్యిలో ఉంటుంది, ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

* మెరిసే చర్మం సొంతం చేసుకోవాలనుకునే నెయ్యిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి చర్మానికి చాలా అవసరం. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు చర్మంపై ఉండే ఫైన్ లైన్స్, ముడతలు మొదలైనవాటిని కూడా తగ్గిస్తుంది. డ్రై స్కిన్‌తో ఇబ్బంది పడే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

* నెయ్యిలోని ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు నేచురల్ కండిషనింగ్ అందిస్తాయి. కాబట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తినడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

* నెయ్యి కీళ్లకు లూబ్రికేషన్‌లా ఉపయోగపడుతుంది. దీని వల్ల మోకాళ్లతో పాటు ఇతర కీళ్లు త్వరగా అరిగిపోవు. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి, తద్వారా కీళ్ల నొప్పులను తగ్గుతాయి. ఇది ఎముకలను దృఢపరచడంలో సహాయపడుతుంది.

* ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తింటే పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది పేగు ఆమ్లతను తగ్గిస్తుంది, అలాగే పోషకాల శోషణను పెంచుతుంది. దీంతో మెరుగైన జీర్ణక్రియను సొంతం చేసుకోవచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్