TV9 Telugu

17 May 2024

పడుకునే ముందు ఇవి తినండి.. హాయిగా నిద్ర పడుతుంది 

మెగ్నీషియం కంటెంట్‌ ఎక్కువగా ఉండే పాలకూర, బాదం వంటివి తీసుకుంటే హాయిగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతీరోజూ రాత్రి వాటిని తీసుకోవాలని చెబుతున్నారు 

ఇక ఒత్తిడిని చిత్తు చేయడంలో తులసి ఆకులను ఎంతగానో ఉపయోగపడతాయి. రాత్రి నాలుగు తులసి ఆకులు నమిలితే ఒత్తిడి తగ్గి హాయిగా నిద్రపడుతుంది.

రాత్రి పడుకునే ముందు డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జీడిపప్పు, వాల్‌నట్స్‌ వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు.

చెర్రీ పండ్లు కూడా నిద్రకు ఉపక్రమించేందుకు ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం ద్వారా నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ కూడా పెరుగుతుంది. దీంతో మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

మెలటోనిన్‌కు పెట్టింది పేరు ఓట్స్‌. వీటిని క్రమంత తప్పకుండా తీసుకోవడం ద్వారా రాత్రుళ్లు హాయిగా నిద్రపడుతుంది. త్వరగా జీర్ణమై కడుపు లైట్గా మారేలా చేస్తుంది. 

నిద్రలేమికి చెక్‌ పెట్టడంలో కివీ పండు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్, సెరోటోనిన్ నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అరటిపండులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది నిద్రలేమి సమస్యకు చెక్‌ పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణుల చెబుతుంటారు. కండరాలు, నరాలు రిలాక్స్‌ చేసి ప్రశాంతతను ఇస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.