మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే బహుపరాక్.. విటమిన్ డి లోపం కావొచ్చు 

17 May 2024

TV9 Telugu

Pic credit - Pexels

విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. ఇది ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.

విటమిన్ డి

ఈ విటమిన్ ఉన్న ఆహారాన్ని తినకపోతే శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. అంతేకాదు  సూర్యరశ్మి తక్కువగా శరీరానికి తగిలినా విటమిన్ డి లోపం ఏర్పడుతుంది.

విటమిన్ డి లోపం

విటమిన్ డి లోపం పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మహిళల్లో హార్మోన్ల మార్పులే దీనికి కారణం. దీని లోపం లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.

లక్షణాలు ఏమిటి

విటమిన్ డి లోపం వల్ల మహిళల్లో ఎముకలు, కండరాల్లో నొప్పి, వాపు వంటి సమస్యలు వస్తాయి.

ఎముకలలో నొప్పి

శరీరంలో విటమిన్ డి లోపిస్తే శక్తి  ఉండదు. దీని వల్ల రోజంతా శరీరం అలసిపోయి బలహీనంగా అనిపించవచ్చు.

అలసట

ఈ విటమిన్  లోపంతో సెరోటోనిన్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది. ఈ హార్మోన్ శరీరానికి ఆనందాన్ని ఇస్తుంది. అయితే దీని స్థాయి తగ్గితే డిప్రెషన్ సమస్య వస్తుంది

నిరాశ

మహిళల్లో విటమిన్ డి లోపం వల్ల జుట్టు రాలిపోతుంది. దీని లోపం జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. కనుక నిర్లక్ష్యం చేయవద్దు.

జుట్టు రాలడం