మామిడి పండ్లలో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ బాధితులు మామిడి పండ్లను మితంగా తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇక మామిడి పండ్లను అధికంగా తీసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. చర్మంపై దురద వంటి సమస్యలు వస్తాయి.
బరువు తగ్గాలనుకునే వారు కూడా మామిడి పండ్లను తక్కువగా తీసుకోవాలి. ఇందులో అధికంగా ఉండే కేలరీలు బరువు పెరగడానికి కారణమవుతుంది.
ఇక మామిడి పండ్లను అతిగా తీసుకుంటే శరీరం వేడి అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మామిడిని కాసేపు నీటిలో నానబెట్టి తీసుకోవాలని చెబుతుంటారు.
మామిడి పండ్లను మోతాదుకు మించి తీసుకుంటే విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎక్కువగా ఉండే ఫైబర్ ఇందుకు కారణంగా చెబుతున్నారు.
అలాగే మామిడి పండ్లను ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పొట్టలో మంట వంటి సమస్యలు రావొచ్చు.
కొందరిలో మామిడి పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల కళ్ల నుంచి నీరు కారడం, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడు అవకాశం ఉంటుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం