TV9 Telugu

02 May 2024

పల్లి పట్టితో ఇన్ని  లాభాలున్నాయా.? 

పల్లి పట్టీలను బెల్లం, పల్లీలతో తయారు చేస్తారనే విషయం తెలిసిందే. పల్లీలు, బెల్లంలోని ఎన్నో గుణాలు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

పల్లీలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయని చెబుతున్నారు.

ఇక రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా పల్లి పట్టీలు ఉపయోగపడతాయి. ఇందులోని అమైనో యాసిడ్స్ రోగ నిరోధక శక్తి పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

పల్లీ పట్టీలను తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి. సోరియాసిస్, ఎగ్జిమా వంటి సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇక పల్లీల్లో సెలీనియం, బెల్లంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.

పల్లీలు, బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇన్‌స్టాంట్‌ ఎనర్జీ అందడంలో పల్లీపట్టిలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాయామం చేసే వారికి ఇది చక్కటి ఆహారంగా చెప్పొచ్చు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.