Mission Mangal: జపాన్‌లో విడుదల కానున్న మరో భారతీయ చిత్రం.. ఫిబ్రవరిలో విడుదల కానున్న ‘మిషన్‌ మంగళ్‌’..

Mission Mangal In Japan: భారతీయ సినిమాలకు జపాన్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలో మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలన్నీ..

Mission Mangal: జపాన్‌లో విడుదల కానున్న మరో భారతీయ చిత్రం.. ఫిబ్రవరిలో విడుదల కానున్న మిషన్‌ మంగళ్‌..

Edited By:

Updated on: Jan 16, 2021 | 9:17 AM

Mission Mangal In Japan: భారతీయ సినిమాలకు జపాన్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలో మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలన్నీ జపాన్‌లో విడుదలై అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన బాహుబలి జపాన్‌లో విడుదలై మంచి రెస్పాన్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజా మరో ఇండియన్‌ మూవీ జపాన్‌ వెండితెరపై మెరవనుంది. అక్షయ్‌ కుమార్, తాప్సీ, విద్యాబాలన్‌, నిత్య మీనన్‌ నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ సినిమా జపాన్‌లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో విజయవంతంగా చేపట్టిన మంగళ్‌యాన్‌ ప్రయోగానికి దృశ్యరూపం ఇస్తూ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం నమోదు చేసుకున్న ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాను జపాన్‌లో ఫిబ్రవరి 8న 40 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారతీయులను ఎంతగానో అలరించిన ఈ సినిమా జపాన్‌లో ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందో చూడాలి .

Also Read: Pawan Kalyan : పవన్ కళ్యాణ్- రానా సినిమాకు సంబంధిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది..