జబర్దస్త్ నటికి వేధింపులు.. అర్థరాత్రి నడిరోడ్డుపై బైక్ ఆపేసి అసభ్యకరమైన ప్రవర్తన..

| Edited By:

May 25, 2020 | 4:35 PM

జబర్థస్త్‌ కామెడీ షో.. ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఈ షోలో చేసిన ఎంతో మంది నటులు ఇప్పుడు మంచి పొజీషన్‌లో ఉన్నారు. అలాంటి ఓ కమెడియనే సాయితేజ అలియాస్ ప్రియాంక. జబర్తస్త్ నుంచి వచ్చిన వాళ్లలో ఈయన...

జబర్దస్త్ నటికి వేధింపులు.. అర్థరాత్రి నడిరోడ్డుపై బైక్ ఆపేసి అసభ్యకరమైన ప్రవర్తన..
Follow us on

జబర్థస్త్‌ కామెడీ షో.. ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఈ షోలో చేసిన ఎంతో మంది నటులు ఇప్పుడు మంచి పొజీషన్‌లో ఉన్నారు. అలాంటి ఓ కమెడియనే సాయితేజ అలియాస్ ప్రియాంక. జబర్తస్త్ నుంచి వచ్చిన వాళ్లలో ఈయన కూడా ఒకడు. కానీ ఇప్పుడు అతడు కాస్తా ఆమె అయ్యాడు. అలాగే సాయితేజ బదులు ప్రియాంక అని పేరు కూడా మార్చుకున్నాడు. స్టేజ్‌పై వీరు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా.. నిజ జీవితంలో మాత్రం చాలా బాధలు పడిన్టలు పలువురు కమెడియన్లు పేర్కొన్నారు. ఇప్పటికే పలు వార్తలు కూడా వచ్చాయి.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రియాంక.. తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టింది. ఆర్టిస్టుగా ఒక్కో రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ కొందరు పనీ పాటు లేని వెధవలు మాత్రం తమపై కామెంట్స్ చేస్తూంటారని చెబుతోంది ప్రియాంక. కామంతో కళ్లు మూసుకుపోయి రకరకాల కామెంట్స్‌తో పాటు అసభ్యకరంగా ప్రవర్తిస్తారని ఆమె పేర్కొంది.

ఇదిలా ఉండగా ఇటీవల మూడు రోజుల కిందట తనతో కొందరు అసభ్యకరంగా ప్రవర్తించారని.. నడిరోడ్డుపై బైక్ ఆపేసి చాలా చెత్తగా బిహేవ్ చేశారని చెప్పింది ప్రియాంక. అర్థరాత్రి స్కూటీపై వస్తుంటే వాళ్లు తనను చూసి కామెంట్స్ చేశారని.. అలాంటి వాళ్లను చంపేసినా పాపం లేదని తన ఆవేదనను వెళ్లగక్కింది. అర్థరాత్రి ఓ అమ్మాయితో అలా బిహేవ్ చేయడం ఎంతవరకూ కరెక్ట్ అని అంటోంది ఈ జబర్దస్త్ నటి.

అలాగే తన పెళ్లిపై వస్తోన్న వార్తలకు మరోసారి ఫుల్‌స్టాప్ పెట్టింది ప్రియాంక. తనను ఎవరు పెళ్లి చేసుకోరని.. ఉన్నా మోసం చేసేవాళ్లే ఎక్కువని వెల్లడించింది. అలాగే ఆ మధ్య ఓ డైరెక్టర్ రూమ్‌కి పిలిచాడని.. ఎంతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది ప్రియాంక. సినిమాలో అవకాశం ఇస్తానని.. కానీ అందుకు మూడు రోజులు తనతో పాటే రూమ్‌లో ఉండాలని.. ఆయనతో పాటు మరొకరు కూడా ఉంటారని చాలా నీచంగా మాట్లాడాడని చెప్పుకొచ్చింది జబర్తస్త్ నటి ప్రియాంక.

Read More: 

స్కుళ్లు ఓపెన్ చేసిన తొలిరోజే.. జగనన్న విద్యా కానుక

‘మన పాలన – మీ సూచన’లో సీఎం జగన్ కీలక పాయింట్స్

బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!