Minor Girl Suicide: మేనబావతో ప్రేమలో పడ్డ మైనర్ బాలిక.. పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. అంతలోనే విషాదం..!

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెద్దలు పెళ్లి రద్దు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.

Minor Girl Suicide: మేనబావతో ప్రేమలో పడ్డ మైనర్ బాలిక.. పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. అంతలోనే విషాదం..!
Follow us
Balaraju Goud

|

Updated on: May 25, 2021 | 8:48 AM

Minor Girl Suicide after Refused Marriage: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెద్దలు పెళ్లి రద్దు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించిన మేనబావతో పెళ్లిని కుటుంబ సభ్యులు రద్దు చేయడంతో బాలిక ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రావులపాలెంనకు చెందిన బాలిక (14) తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో ఆమెతో పాటు ఆమె సోదరిని అమ్మమ్మ తీసుకువచ్చి.. పటాన్‌చెరు మండలం ముత్తంగిలో నివాసం ఉంటున్నారు. బాలిక సంగారెడ్డి గురుకుల వసతి గృహంలో 8వ తరగతి చదువుతోంది. అయితే, కొంతకాలంగా ఆమె మేనబావను ప్రేమిస్తున్నట్లు కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వీరిద్దరికి పెళ్లిచేద్దామని ఇంట్లో వాళ్లు నిర్ణయించుకున్నారు. ఈ మధ్య మేనబావ మద్యానికి బానిసయ్యాడు. ఇది తెలిసి బాలిక కుటుంబ సభ్యులు అతనితో పెళ్లి రద్దు చేద్దామని నిర్ణయించుకున్నారు.

దీంతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 23న సాయంత్రం ఇంట్లో ఉరేసుకొంది. చెల్లెలు చూసి ఇంట్లో చెప్పగా వెంటనే బాలికను పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు.

Read Also….  Hyderabad Water Supply Alert: నగరవాసులకు అలర్ట్.. హైదరాబాద్‏లో నీటి సరఫరాలో అంతరాయం.. ఏ ఏ ప్రాంతాల్లో అంటే..

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..