హైదరాబాద్‌లో మరో 26 బస్తీ దవాఖానాలు

|

Aug 11, 2020 | 9:04 PM

basti davakhana will open on 14th august  : హైదరాబాద్ లో మరో 26 దవాఖానాలు ప్రారంభిస్తున్నట్లుగా మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఈ నెల 14న హైదరాబాద్‌ నగరంలో  వీటిని ప్రారంభించనున్నట్లు  వెల్లడించారు. బస్తీ దవాఖానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ స‌మీక్ష‌లో జీహెచ్ఎమ్‌సీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, 3 జిల్లాల వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ బస్తీ దవాఖానాలను […]

హైదరాబాద్‌లో మరో 26 బస్తీ దవాఖానాలు
Follow us on

basti davakhana will open on 14th august  : హైదరాబాద్ లో మరో 26 దవాఖానాలు ప్రారంభిస్తున్నట్లుగా మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఈ నెల 14న హైదరాబాద్‌ నగరంలో  వీటిని ప్రారంభించనున్నట్లు  వెల్లడించారు. బస్తీ దవాఖానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ స‌మీక్ష‌లో జీహెచ్ఎమ్‌సీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, 3 జిల్లాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

ఈ బస్తీ దవాఖానాలను మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ ప్రారంభిస్తారని చెప్పారు. బస్తీ దవాఖానాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి అన్నారు. జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో 300 బస్తీ దవాఖానాల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే 197 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

జీహెచ్ఎమ్‌సీ పరిధిలో 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయ‌డ‌మే ప్రభుత్వ లక్ష్యమ‌ని అన్నారు. ప్రస్తుతం 170 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని శ్రీనివాస్ యాద‌వ్ తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాలు ప్రారంభించిన విషయం తెలిసిందే.