జగన్ పథకాలవైపు ఇతర రాష్ట్రాలు చూస్తున్నాయి: మంత్రి పేర్ని నాని
విజయవాడలో వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని),ఎమ్మెల్యే జోగి రమేష్, మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. కేంద్రం విద్యుత్ సంస్కరణ లో భాగంగా ప్రతి రైతుకూ మీటర్ కనెక్షన్ వినియోగిస్తున్నామని.. రైతుకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వటమే వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం ముఖ్యోద్దేశ్యమని నాని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతినెలా రైతులు వాడిన విద్యుత్ బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. […]
విజయవాడలో వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని),ఎమ్మెల్యే జోగి రమేష్, మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. కేంద్రం విద్యుత్ సంస్కరణ లో భాగంగా ప్రతి రైతుకూ మీటర్ కనెక్షన్ వినియోగిస్తున్నామని.. రైతుకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వటమే వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం ముఖ్యోద్దేశ్యమని నాని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతినెలా రైతులు వాడిన విద్యుత్ బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. వాటికోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యుత్ శాఖ మాత్రమే ఆ అకౌంట్ లో నిధులను వాడుకుంటుందని మంత్రి తెలిపారు. టీడీపీ హయాంలో పక్క రాష్ట్రాల పథకాలు కాపీ కొట్టారని..ఇప్పుడు జగన్ పథకాలను ఇతర రాష్ట్రాలు చూస్తున్నాయని మంత్రి చెప్పారు.