కేంద్రం సంచలన నిర్ణయం.. విద్యుత్ డిస్కంల ప్రైవేటీకరణ – నిర్మలా సీతారామన్

ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ(డిస్కం)లను ప్రైవేటీకరిస్తున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నాలుగు రోజులుగా వివిధ రంగాలకు సంబంధించిన ప్యాకేజీలు, సంస్కరణలను ప్రకటిస్తున్న నిర్మలా సీతారామన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ డిస్కంలు ఆర్థిక భారంతో సతమతం అవుతున్నాయని, వాటిని గాడిన పెట్టడానికి రూ.90వేల కోట్లను కేంద్రం ఇచ్చిందన్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టేక్కిచ్చేందుకే ఈ నిర్ణయం […]

కేంద్రం సంచలన నిర్ణయం..  విద్యుత్ డిస్కంల ప్రైవేటీకరణ - నిర్మలా సీతారామన్

Edited By:

Updated on: Oct 18, 2020 | 8:30 PM

ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ(డిస్కం)లను ప్రైవేటీకరిస్తున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నాలుగు రోజులుగా వివిధ రంగాలకు సంబంధించిన ప్యాకేజీలు, సంస్కరణలను ప్రకటిస్తున్న నిర్మలా సీతారామన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ డిస్కంలు ఆర్థిక భారంతో సతమతం అవుతున్నాయని, వాటిని గాడిన పెట్టడానికి రూ.90వేల కోట్లను కేంద్రం ఇచ్చిందన్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టేక్కిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. త్వరలో దేశవ్యాప్తంగా స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లను ప్రవేశ పెడతామని కేంద్ర మంత్రి ప్రకటించారు.