పట్టణవాసుల దీర్ఘకాల సమస్యలకు శాశ్వత పరిష్కారంః కేటీఆర్

|

Sep 28, 2020 | 10:27 PM

పట్టణాల్లో పేరుకుపోయిన దీర్ఘకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు హామీ ఇచ్చారు.

పట్టణవాసుల దీర్ఘకాల సమస్యలకు శాశ్వత పరిష్కారంః కేటీఆర్
Follow us on

పట్టణాల్లో పేరుకుపోయిన దీర్ఘకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు హామీ ఇచ్చారు. మున్సిపాలిటీల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ సమావేశం నిర్వహించారుఅయ్యారు. కొత్త రెవెన్యూ విధానం నేపథ్యంలో భవిష్యత్తులో జరిగే ఆస్తుల క్రయవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజల ఆస్తులపై వారికి శాశ్వత హక్కులు కల్పిస్తామని చెప్పారు. ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ పక్కాగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమిని రికార్డులకు ఎక్కించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.

వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజలు పాల్గొనేలా ప్రతిఒక్కరు చర్యలు తీసుకోవాలని నేతలకు కేటీఆర్‌ సూచించారు. ప్రభుత్వభూముల్లో దశాబ్దాల తరబడి నివాసముంటున్న వారికి ఇప్పటికే 58, 59 జీవోల ద్వారా ఉపశమనం కల్పించామన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఆయా కాలనీల్లోని భూ సంబంధిత సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు సరియైన పరిష్కారం చూపాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలన్నింటినీ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపుతుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.