AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్ద దిక్కులేని ఆ కుటుంబానికి పెద్దాన్న అయ్యాడు.. గూడు లేనివారికి కొత్త ఇళ్లు కట్టించి ఇచ్చిన మంత్రి హరీశ్ రావు

ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుండే రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నిరుపేద కుంటుంబానికి పెద్దాన్నగా అండగా నిలిచాడు. ఇళ్లు కూలి నిరాశ్రయులైన ఆడబిడ్డలకు హరీశ్ రావు ఆసరా అయ్యాడు.

పెద్ద దిక్కులేని ఆ కుటుంబానికి పెద్దాన్న అయ్యాడు.. గూడు లేనివారికి కొత్త ఇళ్లు కట్టించి ఇచ్చిన మంత్రి హరీశ్ రావు
Balaraju Goud
|

Updated on: Dec 19, 2020 | 4:45 PM

Share

ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుండే రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నిరుపేద కుంటుంబానికి పెద్దాన్నగా అండగా నిలిచాడు. ఇళ్లు కూలి నిరాశ్రయులైన ఆడబిడ్డలకు హరీశ్ రావు ఆసరా అయ్యాడు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు దొంతరబోయిన బాలమణికి చెందిన ఇళ్లు కూలిపోయింది. దీంతో తల్లి, కూతురు నిరాశ్రయులయ్యారు. కుటుంబ దీన‌స్థితి తెలుసుకున్న మంత్రి హ‌రీశ్ రావు వెంటనే స్పందించారు.

రామంచ గ్రామానికి చెందిన రాజయ్య కుటుంబం కూలి నాలి పని చేసుకుంటూ జీవనం సాగించారు. 8 ఏళ్ల కిందట అనారోగ్యానికి గురైన రాజయ్య గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబాన్ని కూతురు స్రవంతియే దిక్కైంది.పెండ్లి ఈడుకొచ్చిన ఆడపిల్ల స్రవంతి మేకలు, బర్లు కాపు కాస్తూ ఇళ్లు నెట్టుకొస్తుంది. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉన్న ఇళ్లు కూలిపోయి నిలువనీడలేకుండా పోయింది. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పందించారు. వెంటనే వారు ఇంటిని తిరిగి నిర్మించుకునేందుకు సాయం అందించారు.

పెద్దదిక్కు లేని పేదరికంలో ఉన్న ఇంటికి పెద్దాన్నలా అండ‌గా నిలిచారు. కూలిన ఇళ్లు చోట మరమ్మత్తులు చేయించి కొత్త ఇళ్లు కట్టించారు. శ‌నివారం జ‌రిగిన గృహ‌ప్ర‌వేశానికి మంత్రి హ‌రీశ్ స్వయంగా హాజ‌ర‌య్యారు. త‌ల్లి, కూతురుకు కానుక‌గా కొత్త దుస్తులు అందించి, మిఠాయిలు తినిపించారు. ప‌ది కాలాలు స‌ల్లంగా ఉండాల‌ని దీవెన‌లు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక గ్రామ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని..
సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని..