బిగ్‌బాస్4 ఫైనల్‌లో పాల్గొనలనుకుంటున్నారా.? అయితే ఒక ట్వీట్ చేయండి, మీ అదృష్టాన్ని ప‌రీక్షించుకోండి.

బిగ్‌బాస్4వ సీజన్ ఫినాలేలో ప్రేక్షకులు కూడా పాల్గొనే ఛాన్స్ కల్పించింది స్టార్ మా. ఇందుకోసం సింపుల్‌గా #BBTeluguGrandFinale అని ట్వీట్ చేయమని తెలిపింది. ఇలా ట్వీట్ చేసిన వారిలో కొందరు లక్కీ విన్నర్స్‌ను సెలక్ట్ చేసి గ్రాండ్ ఫినాలేలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.

బిగ్‌బాస్4 ఫైనల్‌లో పాల్గొనలనుకుంటున్నారా.? అయితే ఒక ట్వీట్ చేయండి, మీ అదృష్టాన్ని ప‌రీక్షించుకోండి.

Get lucky chance to participate bigg boss finale: ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షోలలో బిగ్‌బాస్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇంగ్లిష్‌లో మొదలైన ఈ రియాలిటీ షో భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో కొనసాగుతోంది. తెలుగులో విజయవంతంగా మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా నాలుగో సీజన్‌ కూడా ఫైనల్‌కు చేరింది. డిసెంబర్ 20 (ఆదివారం) బిగ్‌బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఈ సీజన్‌ విన్నర్ ఎవరనే సస్పెన్స్ అందరిలో నెలకొని ఉంది. ఇక బిగ్‌బాస్ ఫైనల్‌ కార్యక్రమాన్ని స్టార్ మా భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారని ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.


అయితే ఈ ఫినాలేలో ప్రేక్షకులు కూడా పాల్గొనే ఛాన్స్ కల్పించింది స్టార్ మా. ఇందుకోసం సింపుల్‌గా #BBTeluguGrandFinale అని ట్వీట్ చేయమని తెలిపింది. ఇలా ట్వీట్ చేసిన వారిలో కొందరు లక్కీ విన్నర్స్‌ను సెలక్ట్ చేసి గ్రాండ్ ఫినాలేలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఇదిలా ఉంటే టాప్ 5 లో ఉన్న అఖిల్, అభిజీత్, అరియానా, సోహైల్, హారిక‌ల‌లో అరియానా లేదా అభిజీత్‌ల‌లో ఒక‌రు సీజన్4 వివేతగా నిలుస్తారని ప్రచారం జరుగుతోంది.