ఆస్ట్రేలియా – భారత్ ఫస్ట్ టెస్ట్…. ఓటమి బాధించింది… భారత జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ…

ఆస్ట్రేలియా‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. టెస్టు పరాభవంపై కెప్టెన్ విరాట్ కొహ్లీ స్పందించారు.

ఆస్ట్రేలియా - భారత్ ఫస్ట్ టెస్ట్.... ఓటమి బాధించింది... భారత జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 19, 2020 | 4:30 PM

ఆస్ట్రేలియా‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. టెస్టు పరాభవంపై కెప్టెన్ విరాట్ కొహ్లీ స్పందించారు. మ్యాచ్ ఫలితంపై మాట్లాడాలంటే మాటలు రావడం లేదని అన్నారు. మ్యాచ్‌లో ఆధిక్యంలో ఉండి కూడా రెండో ఇన్నింగ్స్‌లో తొందరగా ఆలౌట్ అవ్వడం బాధాకరమని తెలిపారు.

రెండు రోజులు ఎంతో శ్రమించి తిరుగులేని స్థానంలో ఉండి, కేవలం గంట వ్యవధిలో ఓటమి అంచులకు చేరిపోవడం బాధించిందని అన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో మరింత శ్రమించాల్సి ఉండిందని వివరించారు. ఆసీస్ బౌలర్లు మొదటి ఇన్నింగ్స్ ‌తరహా బౌలింగ్ చేసినా… తామే బ్యాటింగ్ చేయాలని ప్రయత్నించి వికెట్లు ఇచ్చామని తెలిపాడు. అయితే రానున్న టెస్టు మ్యాచుల్లో భారత్ పుంజుకుంటుందని ఆశా భావం వ్యక్తం చేశారు. కాగా, విరాట్ కొహ్లీ రెండో టెస్టు నుంచి అందుబాటులో ఉండడు. తన భార్య అనుష్క శర్మ ప్రసవం ఉండడంతో కొహ్లీ భారత్ తిరుగు పయనం అవుతున్నారు.