49204084041 ఇది ఓటీపీ కాదు.. టీమిండియా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో చేసిన స్కోర్.. అంటూ సెహ్వాగ్ వేసిన సెటైర్
ఘోర పరాజయాన్ని మర్చిపోయేందుకు ఇదిగో ఓటీపీ(OTP) ఇదే అంటూ 49204084041 అంటూ తన ట్విట్టర్ ఖాతలో వీరు పోస్ట్ చేశాడు. వీరు చేసిన చమత్కారానికి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్‌గా మారింది.
Virender Sehwag Trolled : 4,9,2,0,4,0,8,4,0,4,1 ఇవి ఎంసెట్‌లో విద్యార్థులకు వచ్చిన ర్యాంకులు కాదు. ఆడిలైడ్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు చేసిన రన్స్.. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ తన దైన తరహాలో సెటైర్లను సందించారు. ఈ ఘోర పరాజయాన్ని మర్చిపోయేందుకు ఇదిగో ఓటీపీ(OTP) ఇదే అంటూ 49204084041 అంటూ తన ట్విట్టర్ ఖాతలో వీరు పోస్ట్ చేశాడు. వీరు చేసిన చమత్కారానికి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్‌గా మారింది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ రన్స్‌పై మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి.
టీమిండియా ఘోర ఓటమిని అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మెరుగైన ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ వంటివారిని పక్కనబెట్టి పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్‌ను ఆడించారని ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా జట్టు కూర్పులో టీమిండియా యాజమాన్యం శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, రిషభ్ పంత్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.