రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం సాయంః గౌతంరెడ్డి

|

Sep 11, 2020 | 11:11 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు ఏపీ రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి. విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పది ఫిషింగ్‌ హార్బర్ల అన్ని విధాలుగా సహాయం చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారని మంత్రి గౌతంరెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం సాయంః గౌతంరెడ్డి
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు ఏపీ రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి. విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పది ఫిషింగ్‌ హార్బర్ల అన్ని విధాలుగా సహాయం చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారని మంత్రి గౌతంరెడ్డి తెలిపారు. ఆయన గురువారం కేంద్ర మంత్రులు మన్షుక్‌ లక్ష్మణ్‌భాయ్‌ మాండవీయ, పీయూష్‌ గోయెల్‌తో విడివిడిగా సమావేశమయ్యారు. విశాఖపట్నం-చెన్నై కారిడార్‌ ప్రాజెక్టు అభివృద్ధి ప్రణాళికపై కేంద్రమంత్రి మాండవీయతో చర్చించామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్‌ ప్రాజెక్టులు ఏపీలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌కు వివరించినట్లు మంత్రి వెల్లడించారు. కడప జిల్లాలోని కొప్పర్తి కేంద్రంగా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ క్లస్టర్‌ అభివృద్ధి కేంద్రానికి సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఎలక్ట్రానిక్ క్లస్టర్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ఆకర్షించి, భవిష్యత్‌లో ఏపీని దేశంలోనే అగ్రగామి నిలపాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. అలాగే, బల్క్‌ డ్రగ్‌ పార్కులపై కేంద్రంతో చర్చించినట్లు మంత్రి గౌతంరెడ్డి తెలిపారు. పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌పై చర్చించామని, దీనిపై ఒక కమిటీని నియమించి తగు చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు వివరించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌లో ఏపీ నంబర్‌ వన్‌గా నిలవడంపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ అభినందనలు తెలిపారన్నారు. ఏపీ నూతన పారిశ్రామిక విధానంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను గురించి వివరించామన్నారు. దొనకొండను రక్షణ రంగ తయారీ క్లస్టర్‌గా తీర్చిదిద్దే విషయాన్ని చర్చించామని గౌతమ్‌రెడ్డి చెప్పారు. నెల్లూరు-నడికుడి రైల్వే లైన్‌ పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని పీయూ్‌షగోయెల్‌ను కోరినట్లు మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వెల్లడించారు.