నాంప‌ల్లి నుమాయిష్‌పై కరోనా ప్రభావం..తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాట్లు ప్రకటించిన మంత్రి ఈట‌ల రాజేంద‌ర్

ప్రతి ఏటా తొలి రోజున హైదరాబాదీలను పలకరించే నాంప‌ల్లి నుమాయిష్ ఈ ఏడాది వాయిదా పడింది.  రేప‌ట్నుంచి ప్రారంభం కావాల్సిన నుమాయిష్‌ను తాత్కాలికంగా...

నాంప‌ల్లి నుమాయిష్‌పై కరోనా ప్రభావం..తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాట్లు ప్రకటించిన మంత్రి ఈట‌ల రాజేంద‌ర్

Updated on: Dec 31, 2020 | 12:18 PM

Numaish Postponement : ప్రతి ఏటా తొలి రోజున హైదరాబాదీలను పలకరించే నాంప‌ల్లి నుమాయిష్ ఈ ఏడాది వాయిదా పడింది.  రేప‌ట్నుంచి ప్రారంభం కావాల్సిన నుమాయిష్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్న‌ట్లు నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ సొసైటీ అధ్య‌క్షుడు, రాష్ర్ట మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. క‌రోనా వ్యాప్తి కార‌ణంగానే నుమాయిష్‌ను కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తున్న‌ట్లు మంత్రి వెల్లడించారు. నుమాయిష్ ఎప్ప‌ట్నుంచి ప్రారంభిస్తామ‌నేది త్వ‌ర‌లోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ప్ర‌తి ఏడాది 45 రోజుల పాటు సందడిగా సాగే నుమాయిష్‌పై కోవిడ్ ప్రభావం పడింది. రోజు రోజుకు విచిత్ర రూాపాల్లో ప్రజలపై దాడి చేస్తున్న కరోనానే ఇందుకు కారణం. జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన ప్రారంభ‌మ‌య్యే నాంపల్లి నుమాయిష్.. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ వ‌ర‌కు జరుగుతుంది. వివిధ రాష్ర్టాల నుంచి సుమారు 1500 నుంచి 2 వేల వ‌ర‌కు చిన్న వ్యాపారులు స్టాళ్ల‌ను ఏర్పాటు చేసేవారు. పిల్ల‌లు ఆడుకునే ఆట‌బొమ్మ‌ల నుంచి గృహోపకరణాలు వరకు ఇక్కడ అమ్మకానికి వచ్చేవి. ఆ నెల 15 రోజుల పాటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రత్యేకంగా నిలిచేంది.