Mini Medaram Jatara: ఈరోజు నుంచి 4 రోజుల పాటు మినీ మేడారం జాతర.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పెరుగాంచిన సమ్మక్క-సారలమ్మ చిన్న జాతరకు వేళయింది. మండమేలిగే పండుగ సందర్భంగా పూజారులు అమ్మవార్ల గద్దెల వద్ద ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు
Mini Medaram Jatara: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పెరుగాంచిన సమ్మక్క-సారలమ్మ చిన్న జాతరకు వేళయింది. మండమేలిగే పండుగ సందర్భంగా పూజారులు అమ్మవార్ల గద్దెల వద్ద ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇప్పటికే జాతరకు ఆలయ కమిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు నుంచి 27వ తేదీ వరకు ఈ జాతర జరగనుందని అధికారులు ప్రకటించారు. కాగా, మేడారం చిన్న జాతర తేదీలు ఖారురు కావడంతో అధికారులు జాతర కోసం అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు. అసలైన సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాల ఒకసారి జరుగుతుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే మినీ మేడారం జాతరకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. జాతరకు హాజరయ్యే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కోటి 52 లక్షల రూపాయలను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య చెప్పారు. ఈ నిధులను వివిధ శాఖలకు కేటాయించి జాతరకు హాజరయ్యే భక్తులకు మెరుగైన వసతులు కల్పించనున్నారు.
Also Read: