ఏపీలో రైతు భరోసా కేంద్రాల వద్ద పాలసేకరణ
ఏపీ ఆమూల్ ప్రాజెక్టు పేరుతో ఈ నెల 20 నుంచి రైతు భరోసా కేంద్రాల నుంచి పాల సేకరణ ప్రారంభం కానుందని పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పల రాజు తెలిపారు.

ఏపీ ఆమూల్ ప్రాజెక్టు పేరుతో ఈ నెల 20 నుంచి రైతు భరోసా కేంద్రాల నుంచి పాల సేకరణ ప్రారంభం కానుందని పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పల రాజు తెలిపారు. సీఎం జగన్ పాదయాత్రలో పాడి రైతులకు ఇచ్చిన హామీలను నేరవేరుస్తామని పేర్కొన్నారు. 25 తేదీన ఆయా పాడి రైతులకు పాలకు సంబంధించిన బిల్లులను సీఎం జగనే నేరుగా ఆన్‌లైన్‌లో చెల్లిస్తారని చెప్పారు. ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని పాల సేకరణ కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1362 కోట్ల రూపాయలతో డైరీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
Also Read :
‘జగనన్న విద్యాదీవెన’ పథకంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం