‘జగనన్న విద్యాదీవెన’ పథకంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

అసలే కరోనా కష్టాలు..ఆపై అరకొర జీతాలు..కరోనా నుంచి బయటపడని జీవితాలు. ప్రస్తుతం ఎన్నో గడ్డు సమస్యలు సామాన్య మానవులను వెంటాడుతున్నాయి.

'జగనన్న విద్యాదీవెన' పథకంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం
Follow us

|

Updated on: Nov 06, 2020 | 2:15 PM

అసలే కరోనా కష్టాలు..ఆపై అరకొర జీతాలు..కరోనా నుంచి బయటపడని జీవితాలు. ప్రస్తుతం ఎన్నో గడ్డు సమస్యలు సామాన్య మానవులను వెంటాడుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లు కూడా గడవని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పిల్లల కాలేజీ ఫీజులు చెల్లించడం తల్లిదండ్రులకు తలకు మించిన భారమే. అయితే ఏపీలో సీఎం జగన్..జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పేద కుటుంబాలకు చేయూతగా నిలుస్తోన్న విషయం తెలిసిందే. కాగా విద్యా దీవెనకు అర్హులైన పేద విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి పెట్టొద్దు అంటూ కళాశాలలకు  ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రవేశాల సమయంలో ఫీజుల కోసం ఒత్తిడి గురి చేయవద్దని సూచించింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నాలుగు విడతలుగా డబ్బు జమ చేస్తోన్నట్లు తెలిపింది. నిధులు విడుదల చేసిన వారంలోపు పేరెంట్స్ కళాశాలలకు ఫీజు చెల్లిస్తారని.. సరైన రీజన్ లేకుండా ఫీజు చెల్లించకపోయినా.. స్కీమ్ డబ్బును దుర్వినియోగం చేసినా తమ బాధ్యత కాదంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జగనన్న విద్యాదీవెన స్కీమ్ కింద విద్యార్థులకు గవర్నమెంట్ ఫీజులు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల అకౌంట్లలోకి ప్రభుత్వం జమ చేస్తుంది. తల్లుల ఖాతాల్లో నాలుగు త్రైమాసికాలకు డబ్బు వేస్తారు. తల్లిదండ్రులు మాత్రం కళాశాలలకు వెళ్లి ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా చెయ్యడం వల్ల తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లే వీలు ఉంటుందని, ఫీజులు నేరుగా చెల్లించడంవల్ల.. అక్కడ విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి తెలుసుకోవడం, పరిష్కారం కాని సమస్యలు ఉంటే అధికారులు దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read :

ఆ అడుగు పడి సరిగ్గా మూడేళ్లు

ఏపీలో మెడికల్ కోర్సుల ఫీజులు సవరించిన ప్రభుత్వం

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...