రూ.4.60 కోట్లకు అమ్ముడుపోయిన మైఖేల్ ‘బూట్లు’…

అమెరికా బాస్కెట్‌ బాల్‌ దిగ్గజం మైఖేల్‌ జోర్డాన్‌ ఆటలోనే కాదు... తాను ధరించినవాటిని అమ్మి సొమ్ము చేసుకోవడంలోనూ రికార్డులను సొంతం చేసుకుంటున్నారు. మైఖేల్ ఇటలీలో జరిగిన....

  • Sanjay Kasula
  • Publish Date - 5:26 am, Sun, 16 August 20
రూ.4.60 కోట్లకు అమ్ముడుపోయిన మైఖేల్ 'బూట్లు'...

అమెరికా బాస్కెట్‌ బాల్‌ దిగ్గజం మైఖేల్‌ జోర్డాన్‌ ఆటలోనే కాదు… తాను ధరించినవాటిని అమ్మి సొమ్ము చేసుకోవడంలోనూ రికార్డులను సొంతం చేసుకుంటున్నారు. మైఖేల్ ఇటలీలో జరిగిన ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో తాను వినియోగించిన బూట్లను ఇటీవల ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టాడు. వేలంలో ఈ బూట్లు రికార్డు స్థాయిలో సుమారు రూ.4.60 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ బూట్లను ధరించే జోర్డాన్‌ 1985లో షికాగో బుల్స్‌ తరఫున ఆడాడు.

అయితే ఆయన తన వస్తువులను వేలంలో అమ్మడం ఇదేం మొదటి సారి కాదు. గతంలో కూడా బూట్లను వేలానికి పెట్టి రూ.4.19 కోట్లను సొంతం చేసుకున్నాడు. అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మైఖేల్‌కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అమెరికా అగ్రరాజ్యంలో  బస్కెట్ బాల్ ఆట అంటే పిచ్చి.

అయితే ఈ సారి మైఖేల్ అమ్మకానికి పెట్టిన ఎరుపు, నలుపు రంగులో ఈ బూట్లు ఉన్నాయి. వీటి సైజు 13.5.‌ మైఖేల్‌ జోర్డాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.