ఢిల్లీలో వస్తాదులు రోడ్డెక్కారు..

క‌రోనా పాజిటివ్‌ కేసుల తీవ్ర‌త దృష్ట్యా అన్నింటికి స‌డ‌లింపులు ఇవ్వ‌డంలేదు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఇప్ప‌టివ‌ర‌కు జిమ్‌ల‌కు అనుమ‌తించ‌లేదు. దీంతో ఇండియన్ జిమ్స్ వెల్ఫేర్ ఫెడ‌రేష‌న్ ఆందోళన బాటపట్టింది.

ఢిల్లీలో వస్తాదులు రోడ్డెక్కారు..

Updated on: Aug 28, 2020 | 3:01 PM

దేశ వ్యాప్తంగా కల్లోలానికి జన సమర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. సామూహిక కార్యక్రమాలపై అంక్షలు విధించింది. క‌రోనా విస్త‌రిస్తుండడంతో వివిధ రాష్ట్రాల ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా దేశ‌మంత‌టా అన్ని ర‌కాల వ్యాపార కార్య‌క‌లాపాలు స్తంభించిపోయాయి. అయితే, రెండు నెల‌ల‌కు పైగా క‌ఠిన లాక్‌డౌన్ కొన‌సాగించినా ప‌రిస్థితిలో ఎలాంటి మార్పు రాక‌పోవ‌డంతో కేంద్రం ద‌శ‌ల‌వారీగా స‌డ‌లింపులు ఇస్తూ వెళ్లింది. దీంతో మూత‌ప‌డ్డ అనేక వ్యాపారాలు, సేవ‌లు పునఃప్రాంభం అయ్యాయి. కానీ, జిమ్స్, బార్లు, పబ్సులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.

అయితే, కొన్ని రాష్ట్రాలు మాత్రం క‌రోనా పాజిటివ్‌ కేసుల తీవ్ర‌త దృష్ట్యా అన్నింటికి స‌డ‌లింపులు ఇవ్వ‌డంలేదు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఇప్ప‌టివ‌ర‌కు జిమ్‌ల‌కు అనుమ‌తించ‌లేదు. దీంతో ఇండియన్ జిమ్స్ వెల్ఫేర్ ఫెడ‌రేష‌న్ ఆందోళన బాటపట్టింది. అన్ని వాణిజ్య కార్యకలాపాలకు ఒకే చెప్పి జిమ్స్ ఎందుకు తెరవడంలేదని ప్రశ్నిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ ప్రదర్శన చేపట్టింది. ఢిల్లీ ప్ర‌భుత్వానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అనిల్ బైజాల్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న నిర్వహించారు. న‌గ‌రానికి చెందిన ప‌లువురు జిమ్ నిర్వాహ‌కులు ఈ ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. న‌గ‌రంలో జిమ్‌లను వెంట‌నే పునఃప్రారంభించాల‌ని వారు డిమాండ్ చేశారు. ‌