తెలంగాణలో.. ‘మీ’ సేవలు షురూ

| Edited By: Pardhasaradhi Peri

May 07, 2020 | 10:39 AM

కరోనా మహమ్మారి కట్టడికోసం లాక్‌డౌన్ నడుస్తోంది. దీంతో మూతప‌డ్డ మీసేవా- కేంద్రాలు నేటి నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. నలభైఐదు రోజుల విరామం అనంతరం రాష్ట్రంలో మీ-సేవాకేంద్రాలు మళ్లీ తెరుచుకోనున్నాయి.

తెలంగాణలో.. మీ సేవలు షురూ
Follow us on

Mee Seva Service: కరోనా మహమ్మారి కట్టడికోసం లాక్‌డౌన్ నడుస్తోంది. దీంతో మూతప‌డ్డ మీసేవా- కేంద్రాలు నేటి నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. నలభైఐదు రోజుల విరామం అనంతరం రాష్ట్రంలో మీ-సేవాకేంద్రాలు మళ్లీ తెరుచుకోనున్నాయి. కంటైన్మెంట్ ప్రాంతాలు మిన‌హా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మీసేవా కేంద్రాలను ప్రారంభించవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

కాగా.. ఇప్ప‌టికే అన్నిరిజిస్ట్రేష‌న్‌‌, ఆర్టీఏ కార్యాలయాలు ప్రారంభం కావడంతో.. వీటికి అనుసంధానంగా ఉన్న మీ-సేవా కేంద్రాలు ప‌నిచేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రాన్ని తెరవాలని, కేంద్రాలలో సిబ్బంది, వినియోగదారులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని కేంద్రాలలో శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని సూచించింది.