మధ్య వర్తిత్వంతో ఉపయోగం లేదు.. ఆర్డినెన్స్ తేవాల్సిందేనన్న శివసేన

మహారాష్ట్ర : మ‌ధ్య‌వ‌ర్తులతో అయోధ్య వివాదం ప‌రిష్కారం కాదని పేర్కంది శివసేన. అయోధ్య రామ మందిర నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి.. వెంటనే ఆలయ నిర్మాణాలు చేపట్టాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. రాజ‌కీయ నేత‌లు, పాల‌కులు, సుప్రీంకోర్టు కూడా అయోధ్య వివాదాన్ని ప‌రిష్క‌రించ‌లేక‌పోయార‌ని, అలాంటి సంద‌ర్భంలో మ‌ధ్య‌వ‌ర్తులు ఏం చేస్తార‌ని ఆ పార్టీ ప్ర‌శ్నించింది. అయోధ్య వివాద ప‌రిష్కారం కోసం సుప్రీం ముగ్గురు స‌భ్యుల‌తో మ‌ధ్య‌వ‌ర్తుల క‌మిటీని నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఈ […]

మధ్య వర్తిత్వంతో ఉపయోగం లేదు.. ఆర్డినెన్స్ తేవాల్సిందేనన్న శివసేన

Edited By:

Updated on: Mar 09, 2019 | 4:17 PM

మహారాష్ట్ర : మ‌ధ్య‌వ‌ర్తులతో అయోధ్య వివాదం ప‌రిష్కారం కాదని పేర్కంది శివసేన. అయోధ్య రామ మందిర నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి.. వెంటనే ఆలయ నిర్మాణాలు చేపట్టాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. రాజ‌కీయ నేత‌లు, పాల‌కులు, సుప్రీంకోర్టు కూడా అయోధ్య వివాదాన్ని ప‌రిష్క‌రించ‌లేక‌పోయార‌ని, అలాంటి సంద‌ర్భంలో మ‌ధ్య‌వ‌ర్తులు ఏం చేస్తార‌ని ఆ పార్టీ ప్ర‌శ్నించింది. అయోధ్య వివాద ప‌రిష్కారం కోసం సుప్రీం ముగ్గురు స‌భ్యుల‌తో మ‌ధ్య‌వ‌ర్తుల క‌మిటీని నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శివ‌సేన పార్టీ స్పందించింది. సామ్నా ప‌త్రిక‌లో ఆ పార్టీ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. మధ్య‌వ‌ర్తుల‌తో స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని భావిస్తే, గ‌త 25 ఏళ్లుగా స‌మ‌స్య‌ ఎందుకు అలాగే ఉండిపోయింద‌ని, వంద‌లాది మందికి ఎందుకు చ‌నిపోయార‌ని శివసేన సామ్నా పత్రికలో ప్ర‌శ్నించింది.