పిలకలో ‘దాగున్న’ విడాకులు..సస్పెన్స్‌లో క్లైమాక్స్

| Edited By: Srinu

May 14, 2019 | 6:47 PM

ఈ మధ్య వివాహ బంధాలు విడిపోవడానికి పెద్ద, పెద్ద కారణాలు అవసరం ఉండటం లేదు. చాల సింపుల్ ఇంకా చెప్పాలంటే సిల్లీ రీజన్స్ వల్లే మ్యారేజ్ రిలేషన్‌షిప్‌కి ఎండ్ కార్డ్ వేస్తున్నారు ప్రజంట్ జనరేషన్ యూత్. తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ విడాకుల కేసును పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. భర్త పిలక ఉంచుకోవడం నచ్చడం లేదంటూ ఓ భార్య, అతని నుంచి విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అలా అని ఆవిడ నిరక్షరాస్యురాలు కాదు. మాస్టర్స్ […]

పిలకలో దాగున్న విడాకులు..సస్పెన్స్‌లో క్లైమాక్స్
Follow us on

ఈ మధ్య వివాహ బంధాలు విడిపోవడానికి పెద్ద, పెద్ద కారణాలు అవసరం ఉండటం లేదు. చాల సింపుల్ ఇంకా చెప్పాలంటే సిల్లీ రీజన్స్ వల్లే మ్యారేజ్ రిలేషన్‌షిప్‌కి ఎండ్ కార్డ్ వేస్తున్నారు ప్రజంట్ జనరేషన్ యూత్. తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ విడాకుల కేసును పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. భర్త పిలక ఉంచుకోవడం నచ్చడం లేదంటూ ఓ భార్య, అతని నుంచి విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అలా అని ఆవిడ నిరక్షరాస్యురాలు కాదు. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన సిటీ ఉమెన్.

వివరాల్లోకి వెళితే.. భోపాల్ ఏరియాలో నివాసముంటున్న ప్రవీణ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్… ఎమ్‌బీఏ చదివిన ప్రత్యూష అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ రెండేళ్లు కాపురం కూడా చేశారు. అయితే కొన్నాళ్ల ప్రవీణ్ తమ ఫ్యామిలీ ఆచారం ప్రకారం గుండు చేయించుకోని..వెనుక చిన్న పిలుక ఉంచుకున్నాడు. అది నచ్చని ప్రత్యూష పిలకను తీసేయాలని కోరింది. దానికి అతను ససేమిరా అనడంతో..  ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. భర్త పిలకతో ఏ మాత్రం బాగోలేడని, అందరూ నవ్వుతున్నారని, తాను చూసి భరించలేకపోతున్నానంటూ ఫ్యామిలీ కోర్టుకెక్కింది ప్రత్యూష. తన మాట వినని భర్తతో కలిసి కాపురం చేయలేనంటూ విడాకులు కావాలంటూ న్యాయమూర్తులను కోరింది. ఆమె మాటలు విన్న న్యాయమూర్తి…సదరు మహిళకు కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ తీర్పు వెలువరించారు.