మాస్టర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.! జనవరి 1న అఫీషియల్ ప్రకటన.. రికార్డులు తిరగ రాయడం ఖాయమంటున్న ఫ్యాన్స్..

|

Dec 13, 2020 | 1:43 PM

దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మాస్టర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.! జనవరి 1న అఫీషియల్ ప్రకటన.. రికార్డులు తిరగ రాయడం ఖాయమంటున్న ఫ్యాన్స్..
Follow us on

Master Release Date: దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాములుగా విజయ్ మూవీ అంటేనే ఫ్యాన్స్‌లో క్రేజ్ విపరీతంగా ఉంటుంది.

ఈ చిత్రంలో విజయ్‌తో పాటు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా విలన్‌గా నటిస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెటేషన్స్ ఇంతకముందు లేనంతగా తారస్థాయికు చేరుకున్నాయి. ఇక దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్ర టీజర్ గత రికార్డులన్నీ కూడా తిరగరాసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మాస్టర్ చిత్రం ట్రైలర్‌ను జనవరి 1న విడుదల చేయడంతో పాటు.. అదే రోజున సంక్రాంతికి మూవీను తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేస్తుందని కోలీవుడ్ మీడియా టాక్. అయితే దీనిపై ప్రస్తుతానికి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఏమీలేదు. కాగా, ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తుండగా.. మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.