ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలోని కొండ దిగువ తొలిపవంచాల వద్ద గోపురంలో మంటలు చెలరేగాయి. ఆలయానికి అలంకరించిన విద్యుత్ దీపాలు పూర్తిగా కాలిపోయాయి. సత్యనారాయణస్వామి తెప్పోత్సవం కార్యక్రమం సందర్భంగా సత్యదేవుని తొలిపవంచాల వద్ద గల కనకదుర్గమ్మ వారి ఆలయం ప్రక్కన ఉన్న గోపురంపై ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలో షాక్ సర్క్యూట్ సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ దీపాలు పూర్తిగా కాలిపోయాయి. అయితే, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. మరోవైపు, నాసిరకం పనులు కారణంగానే అగ్నిప్రమాదం సంభవించిందని భక్తులు ఆరోపిస్తున్నారు.