మారుతీరావు ప్రిలిమినరీ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్..టీవీ9 ఎక్స్‌క్లూజివ్..
మిర్యాడగూడలో ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు ఆదివారం హైదరాబాద్ చింతల్ బస్తీలోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్యహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని సొంతూరు మిర్యాలగూడకు తరలించారు. కాగా మారుతీరావు పోస్టుమార్టానికి సంబంధించిన ప్రిలిమినరీ రిపోర్ట్‌ను టీవీ9 సంపాదించింది. మారుతీరావు విషం తీసుకోవడం వల్లే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. శరీరంపై ఎలాంటి గాయం లేవని, విషం తీసుకుని ఎక్కువ సమయం గడవడం వల్లే శరీరం రంగు మారిందని స్పష్టం చేశారు. […]

మిర్యాడగూడలో ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు ఆదివారం హైదరాబాద్ చింతల్ బస్తీలోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్యహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని సొంతూరు మిర్యాలగూడకు తరలించారు. కాగా మారుతీరావు పోస్టుమార్టానికి సంబంధించిన ప్రిలిమినరీ రిపోర్ట్‌ను టీవీ9 సంపాదించింది.
మారుతీరావు విషం తీసుకోవడం వల్లే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. శరీరంపై ఎలాంటి గాయం లేవని, విషం తీసుకుని ఎక్కువ సమయం గడవడం వల్లే శరీరం రంగు మారిందని స్పష్టం చేశారు. బాడీలో రక్త ప్రసరణ ఆగిపోవడంతో హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, ఆ సమయంలోనే బ్రెయిన్‌డెడ్ అయ్యిందని.. ప్రిలిమినరీ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో డాక్టర్లు వెల్లడించారు. మరోవైపు మారుతిరావు విస్రా శ్యాంపిల్‌ను వైద్యులు సేకరించారు. విస్రా ఎనాలసిస్‌లో ఆయన ఎటువంటి పాయిజన్ తీసుకున్నాడో తెలియనుంది. కాగా, మారుతీరావు అంత్యక్రియలు నేడు మిర్యాలగూడలో జరగనున్నాయి.
