Mumbai: ప్రముఖ సంగీత దర్శకుడు నరేంద్ర భిడే (47) గుండేపోటుతో మరణించారు. గురువారం ఉదయం పూణేలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నరేంద్ర భిడే మృతిపై మరాఠీ సిని పరిశ్రమతోపాటు, పలువులు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
నరేంద్ర భిడే మరాఠీ చిత్రపరిశ్రమలో మంచి సంగీత దర్శకుడిగా పేరోందారు. అన్ని వయసులవారికి తన సంగీతం అందించారు. ఏ పేయింగ్ గోస్ట్ లాంటి నాటకాలతోపాటు, డియోల్ బ్యాండ్, బయోస్కోప్, ఉబూన్ టు, పుష్పక్ విమాన్, హరిశ్చంద్ర ఫ్యాక్టరీ, సానే గురూజీ, సరివర్ సారి వంటి ఎన్నో సినిమాలకు నరేంద్ర సంగీతాన్ని అందించారు. పూణేలోని స్టూడియో డాన్ ఇన్ఫోటైన్మెంట్లో డైరెక్టర్గా కూడా పనిచేశారు. నరేంద్ర సినిమాలు, సీరియల్స్, నాటకాలకు సంగీతాన్ని అందించారు. భిడే ఇప్పటీకే ఐదు సార్లు జీగౌరవ్, రెండు సార్లు స్టేట్ డ్రామా అవార్డు, వి.శాంతారామ్ అవార్డు, స్టేట్ ఫిల్మ్ అవార్డులను ఆయన అందుకున్నరు. నరేంద్ర భిడే మరణం సంగీత పరిశ్రమకు తీరనిలోటని ప్రముఖ నటుడు ఓంకర్ తట్టే అన్నారు. భిడేతో కలిసి ఒక శాస్త్రీయ పాటను రికార్డ్ చేయడానికి ఎదురుచూస్తున్నామని, కరోనా కారణంగా ఆ విషయం వాయిదా పడిందని చిత్రనిర్మాత సాగర్ వంజరీ అన్నారు. ఇక ఎప్పటికీ తనకు నరేంద్రతో కలిసి పనిచేసే అవకాశం ఉండదంటూ వంజార విచారణ వ్యక్తం చేశారు.